
భక్తిశ్రద్ధలతో నెహ్రు నగర్ గ్రామం నందు నిర్వహించిన శివాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ , ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలంలోని నెహ్రు నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ఆరోహణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరై, గ్రామ ప్రజలతో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నెహ్రు నగర్ నందు శివాలయం నిర్మాణాన్ని గ్రామస్తులందరు కలిసి నిర్మించడం శుభపరిణామని గ్రామ ప్రజల శ్రమదానంతో ఆలయ నిర్మాణం పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ శివాలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందించడంతో పాటు గ్రామ అభివృద్ధికి ఒక కేంద్రంగా మారాలన్నారు . అలాగే నెహ్రు నగర్ గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగాలని, రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్య పరంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తరుపున కృషి చేస్తామని గ్రామస్తులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , శివాలయం నిర్మాణ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app