SAKSHITHA NEWS

ఎన్నికల ఫలితాలను సిఎం సమీక్షించుకోవాలి.
ప్రస్తుత ఎమ్మెల్సి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాలేవాని ఎందుకు గల కారణాలును సిఎం రేవంత్ రెడ్డి సమీక్షించుకోవాలని సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు.
సిపిఐ మక్డుం నగర్ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో అధికారంలో ఎవరు ఉంటే వారికే అనుకూలంగా ఫలితాలు వచ్చేవని కానీ నేడు అది తలకిందులుగా మారి ప్రతిపక్షాలు గెలచుకోవడం ప్రజలో వస్తున్న మార్పును చూపిస్తుందని,

కావున సిఎం ప్రస్తుత ఫలితాల పై సమీక్షా చేసుకోవాలని ముక్యంగా గత ఎన్నికల సందర్బంగా ఉద్యోగులకు ఇచ్చిన ఓల్డ్ పెన్షన్ స్కీం హామీ పై మాట్లాడక పోవడం వల్ల ఉపాధ్యాయులు నేడు తిరస్కరించారాని కావున గత ఎన్నికలో ఏవైతే హామీ ఇచ్చారో వాటి అమలు కొరకు ఇప్పటికైనా వాటి అమలుకొరకు పునుకోవాలని, అదే విదంగా గత ప్రభుత్వ హయాంలో ఏ విదంగానైతే ప్రభుత్వ భూములు కబ్జా జరిగాయో నేడు మళ్ళీ అదే కబ్జాదారులు దర్జాగా కబ్జాలను చేస్తున్నారని దీనికి స్థానిక కాంగ్రెస్ నాయకుల అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుందని, దాని వల్ల ప్రజల్లో గత బిఆరఎస్ కు నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని భావిస్తున్నారని దీని వల్ల బీజేపీ బలపడే ప్రమాదం ఉందని కావున సిఎం గారు వెంటనే ప్రభుత్వ భూములను,చేరువులను కబ్జాదారుల నుండి వెన్నకి తీసుకోవడం,అలాగే గత హామీలైన పెన్షన్,రుణమాఫీ,రైతుబందు అందరికి అందిస్తేనే రానున్న ఎన్నికలో గెలుస్తారని లేకపోతే ఓడిపోతారని కావున సమయం ఉన్నపుడల్లా సిపిఐ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్మికులు,రైతులు,నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిసుకొని తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
అలాగే గత ఎన్నికల సమయంలో సిపిఐ మిత్రపక్షానికి 2 ఎమ్మెల్సి స్థానాలు ఇస్తామని ఇచ్చినా హామీని నిలపెట్టుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావు,శ్రీనివాస్,కౌన్సిల్ సభ్యులు సామెల్,రవి,ముసలయ్య లు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app