SAKSHITHA NEWS

సమాజంలో వస్తున్న మార్పులను సైద్ధాంతికంగా ఆలోచన చెయ్యాలి.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్ డి యూసుఫ్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వర్రావు భవన్ ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ నాయకులకు నిర్వహించడం జరిగింది.
ఈ తరగతులను ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏ దేశంలోనైనా కార్మికులే అధికసంఖ్యలో ఉండి ఆ దేశాల ఉత్పత్తిని పెంచి అభివృద్ధికి మూల కారకులు కార్మికులేనని కానీ ఆ ఫలితం మాత్రం కార్మికులు అనుభవిస్తలేరని పెట్టుబడిదారులు మాత్రమే అనుభవిస్తున్నారని అన్నారు.దానికి కారణం కార్మికులు కేవలం ఉత్పత్తిలో భాగస్వాములై రాజకీయంగా దూరంగా ఉండటం వల్ల, వారు సృష్టించిన సంపదను పెట్టుబడిదారులు అనుభవిస్తున్నారని, అందుకే కార్మికులు పేద మధ్యతరగతి ప్రజలుగానే ఉంటూ పెట్టుబడిదారులు మాత్రం మరింత ధనవంతులుగా మారుతున్నారని అన్నారు.కావున కార్మికులు రాజకీయ సైద్ధాంతిక అవగాహన కలిగి ఉంటేనే కార్మికులకు తగిన ఫలితం వస్తుందని అన్నారు.కాబట్టి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ముఖ్య నాయకులకు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని దానిని కార్మికవర్గం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.


ఈ సందర్బంగా ఇటీవల మరణించిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేష్, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ చిత్ర పటాలకు నివాళ్ళులు అర్పించడం జరిగింది.
ఈ తరగతులకు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి ప్రిన్సిపాల్ వహించగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర,జిల్లా కార్యదర్శి శ్రీనివాస్,ఆటో యూనియన్ కార్యదర్శి కృష్ణమూర్తి, నియొజకవర్గ అధ్యక్షుడు హరినాథ్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సామెల్,మునిసిపల్ నాయకులు, సిపిఐ సహాయ కార్యదర్శి దుర్గయ్య, ప్రజానాట్యమండలి ప్రవీణ్,భాస్కర్,ఏఐటీయూసీ నాయకులు మహేందర్, సాయులు, సామెల్,
నర్సింహరెడ్డి,బాలాజీ, రాజకుమార్, పూర్ణచందర్, నీలిమ,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS