SAKSHITHA NEWS

ఏఎంజీలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎస్. సత్య దీప్తి ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ బోర్డు మెంబర్ ( ఏఎంజీ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ డేవిడ్ అయ్య మనుమరాలు) పాల్గొనడం జరిగింది. ముందుగా జండా ను ఎగరవేయడం జరిగింది. అనంతరం ఎఎంజి ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి కాలేజీలు, మరియు స్కూల్ విద్యార్థులు మార్చి ఫస్ట్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి సభ్యుల పేర్లతో హౌసెస్ వారీగా మార్చి ఫస్ట్ నిర్వహించడం జరిగింది. దీనితోపాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని వర్ణిస్తూ, ఎందరో స్వతంత్ర సమరయోధులను గుర్తు చేయడం జరిగింది . రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సారధ్యంలో రచించిన రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తూ ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించాలని తెలియజేయడం జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా ఏ ఎం జి హై స్కూల్ ప్రధానోపాధ్యాయు లు కె.కృపాదానం, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సుకన్య, ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్, అబ్రహంశామ్యూల్, డాక్టర్ సత్యవేధం స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ శిరీష్ ,డి ఐ టి సి ప్రిన్సిపాల్ మణి దీపక్, ఆఫీస్ సిబ్బంది మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app