SAKSHITHA NEWS

ఏపీ విద్యార్థులకు అదిరే శుభవార్త

ఉత్తరాంధ్రలో ఐటీఐ చేసిన విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ అదిరే శుభవార్త చెప్పింది. డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటింగ్, ఫిట్టర్, డ్రాప్ట్మన్ (సివిల్) చేసిన ఐటీఐ విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ అప్రెంటిస్‌షిప్ కల్పిస్తోంది.

అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జోనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 16 లోపు పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. అర్హులైన విద్యార్థులు https://apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


SAKSHITHA NEWS