
తెలుగు యూనివర్శిటీ వి.సి నిత్యానందరావు ని సన్మానించిన సాహితీ కళా వేదిక ప్రతినిధులు
సాక్షిత వనపర్తి
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ)ఆచార్య వెలుదండ నిత్యానందరావును వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక ప్రతినిధులు హైదారాబాద్ లో ఆయన ఛాంబర్ లో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిత్యానందరావు ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే . తెలుగు సాహిత్యంలో విశిష్టమైన సేవలందించారని ఆయన పర్యేక్షణలో ఎంతోమంది పరిశోధకులు రిసెర్చ్ చేసి ఉత్తమ పరిశోధనా గ్రంథాలను వెలువరించారని కొనియాడారు.తన పదవీ కాలంలో యూనివర్సిటీ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక ప్రతినిధులు యస్.చంద్ర శేఖర్,బి వి ఆర్ చారి, బైరోజు చంద్ర శేఖర్,డా.బి.శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app