తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి

Spread the love

సాక్షిత : తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే బ్రిడ్జి పక్కన గల ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ..

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు అని, తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని విశ్వవ్యాప్తం  చేసిన మహనీయుడు అని, ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు , ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితమంతా పాటు పడ్డారు .ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ కు ఒక దీక్షుచి అని పేర్కొనడం జరిగినది. సార్ జీవితం లో చివరి క్షణం వరకు  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరాయంగా  తపించిన యోధుడని …నాలుగు కోట్ల తెలంగాణ  ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు…  అని కొనియాడడం జరిగినది    ప్రొఫెసర్. .జయశంకర్ సార్ మార్గదర్శం లో ప్రయాణించి ఆయన  కలలు కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ,ఇకముందు సార్ ఆత్మ శాంతించేలా అయిన చూపిన బంగారు తెలంగాణాకై అందరం  కల్సి కట్టుగా పనిచేసి సార్ కలలు కన్నా బంగారు తెలంగాణ లో పునరంకితం కావాలని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది ,అదేవిదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి .కెసిఆర్ బంగారు తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రొఫెసర్ జయశంకర్ యాదిలో అయన ఆశయాలకనుగుణంగా సీఎం కెసిఆర్ సమర్ధవంతమైన పాలన అందిస్తున్నారని ,నిరంతరం ప్రజా సంక్షేమంకోసం  ఎన్నో వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టడమేకాకుండా పేద  ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ప్రభుత్వ విప్ గాంధీ  చెప్పడం జరిగినది .బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ప్రొఫెసర్. .జయశంకర్ సార్ మార్గదర్శం లో అయన చూపిన తోవలో  రాష్ట్ర ముఖ్యమంత్రి .కెసిఆర్ అడుగుజాడల్లో ప్రయాణించి బంగారు తెలంగాణను సాధిద్దామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మల్లికార్జున శర్మ ,బీఆర్ఎస్ పార్టీనాయకులు కృష్ణ యాదవ్, నటరాజు, గోవిందా చారీ,గోపి కృష్ణ, కవిత, నరేందర్ బల్లా,సందీప్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page