SAKSHITHA NEWS

బస్సు పాసు చార్జీలను పెంచిన తెలంగాణ ఆర్టీసీ

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది ప్రయాణికులపై చార్జీల బాదుడుకు సిద్ధమైంది ఈ క్రమంలోనే తాజాగా బస్సు పాస్ రేట్లను పెంచుతూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది, దీంతో పెరిగిన ధరలు నేటి నుంచే అమలు లోకి రానున్నాయి…

ఈ ధరల పెంపు ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచినట్టు తెలుస్తోంది.

పెరిగిన పాస్ చార్జీలు ప్రకారం.. గతంలో రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్, ఇప్పుడు రూ.1,400కి పెరిగింది. రూ.1,300గా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, ప్రస్తుతం రూ.1,600కి పెరిగింది. అలాగే రూ.1,450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్, ఇప్పుడు రూ.1,800గా అమలులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా గణనీయంగా పెరిగినట్టు అధికారిక సమాచారం.

ఈ పెంపుతో సామాన్య ప్రజానీకానికి రవాణా ఖర్చులు అధికమవు తాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ బస్సుల్లో ప్రయాణిం చే వారు ఇప్పటికే పెరిగిన ధరలతో సతమత మవుతు న్నారు. మరింతగా ప్రభుత్వ వివరణ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.