SAKSHITHA NEWS

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ మహిళా దినోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ జిల్లా లో తేదీ 03-03-2025న మహిళా దినోత్సవం 2025 వేడుకలు పోస్టర్ ను అనుదీప్ దుర్శేట్టి,ఐఏఎస్ కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ , కలెక్టరేట్ లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి ఇంజులరెడ్డి , సునీతజోసి, కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

తేదీ 6,7, & 8 లలో క్రీడలు మరియు సంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ శారీరక విద్య కళాశాల (ఆట స్థలంలో )జరుగును

మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా గెజిటెడ్ అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు మహిళలు జిల్లాలో వివిధ విభాగాలలో సమర్థవంతంగా వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా మహిళా చైర్పర్సన్ ఇంజులా రెడ్డి పావని డాక్టర్ సునీత జోషి డాక్టర్ అమరావతి జ్యోతి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం బి కృష్ణ యాదవ్ అసిస్టెంట్ అధ్యక్షులు, ఆశన్న , M.A. ఖాదర్ సెక్రెటరీ, శ్రీరామ్ జాయింట్ సెక్రెటరీ. జాయింట్ సెక్రటరీ జి వెంకటరమణారెడ్డి బీసీ వెల్ఫేర్ నుండి అపర్ణ సంధ్య. నాగలక్ష్మి స్నేహాలి. ఎమ్మార్వో సునీత తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app