SAKSHITHA NEWS

TDP press meet in Patapatnam constituency of Srikakulam district

టీడీపీ ప్రెస్ మీట్

శ్రీ‌కాకుళం)
యాంకర్ : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు నువ్వానేనా అన్న రీతిలో ఇరువర్గాల నేతల మధ్యనెలకొంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ జడ్పీటీసీ వెలమల గోవిందరావుని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వివాదం ముదురుకుంది.కలమట వెంకటరమణలా ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీలు మారే సంస్కౄతి ఉన్న వ్యక్తికి మళ్ళీ ఓట్లు వేసి గెలిపించే పరిస్థితిలో పాతపట్నం నియోజకవర్గంలో ప్రజలు సిద్ధంగా లేరని జడ్పీటీసీ వెలమల గోవిందరావు అన్నారు.ఈసందర్భంగా శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు…

వాయిస్ : విలేకరుల స‌మావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తాము టీడీపీలో ఉంటూ పార్టీ అభివౄద్ధికి కౄషి చేస్తున్నామ‌న్నారు. గ్రామ‌స్థాయి నుంచి మండ‌ల స్థాయి వ‌ర‌కు త‌మ వంతు పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే లక్ష్యంగా ఇంత వ‌ర‌కు ప‌ని చేశామ‌న్నారు. కానీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ ఉద్దేశ్య పూర్వ‌కంగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పార్టీ ఇబ్బందికర పరిస్థితిలో కూడా తామేమీ అధైర్య ప‌డ‌కుండా పార్టీ అభివౄద్ధి కోసం క్షేత్ర‌స్థాయిలో క‌ష్ట‌ప‌డ్డామ‌న్నారు. పార్టీలో సీనియ‌ర్లుగా ఉన్న త‌మ‌పై వేధించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న పార్టీ మారిన‌ప్పుడు త‌న వెంట వెళ్ల‌లేద‌న్న అక్క‌సుతోనే త‌మ‌పై పార్టీ వ్య‌తిరేకుల‌మ‌ని ముద్ర వేస్తున్నార‌న్నారు. ఇప్ప‌టికీ తాము చిత్త‌శుద్ధితో తెలుగుదేశం పార్టీ అభివౄద్ధికి కౄషి చేస్తున్నామ‌న్నారు. ఇదే విష‌యాన్ని రాష్ట్ర అధ్య‌క్షులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్య‌క్షులు కూన ర‌వికుమార్‌ల‌కు త‌మ‌పై ఉద్దేశ్య‌పూర్వ‌కంగా త‌ప్పుడు స‌మాచారాన్ని ఇచ్చార‌ని అందువ‌ల్లే ప‌ద‌వినుంచి త‌న‌ను తొల‌గించిన‌ట్టు చెప్పారు.

స్పాట్ వాయిస్ : వాడగలరు


SAKSHITHA NEWS