SAKSHITHA NEWS

నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి

ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు.

చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని జగ్జీవన్‌రామ్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావే శానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.

ఈ క్రమంలో నిర్వహించిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సౌమ్య తో కలిపి కృష్ణకుమారికి 15 మంది మద్దతు లభించింది. వైసీపీ అభ్యర్థి ఓర్సు లక్ష్మికి కేవలం ముగ్గురు మాత్రమే మద్దతు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app