SAKSHITHA NEWS

సాక్షిత : (హనుమకొండ జిల్లా నడికూడ మండలం లో ఐదు ప్రాథమికోన్నత పాఠశాలల 18 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఈ ప్రతిభ పాటవ పోటీలలో పాల్గొనడం జరిగింది. నడికుడా మండలంలో
ఉపాధ్యాయులు టిఎల్ఎం మేళాలో తమ యొక్క ప్రదర్శనను చూపెట్టడం జరిగింది. టిఎల్ఎం మేళాలో 18 పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మంచి టిఎల్ఎం చేసిన ఉపాధ్యాయుల కు బహుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా పులిగిల్ల, వరి కోల్ ఆత్మకూర్ ఉపాధ్యాయులు మంచి ప్రదర్శనతో బహుమతులు అందుకోవడం జరిగింది.


వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులకు తెలుగు ఆంగ్లం అర్థమెటిక్ లలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా యుపిఎస్ పులిగిల్ల విద్యార్థులకు ఐదు బహుమతులు.
పిఎస్ వరి కోల్ విద్యార్థులకు నాలుగు బహుమతులు పిఎస్ నడికూడ విద్యార్థులకు నాలుగు బహుమతులు పిఎస్ నార్లపూర్ విద్యార్థులకు మూడు బహుమతులు కంటా ఆత్మకూరు విద్యార్థులకు మూడు బహుమతులు ముస్త్యలపల్లి విద్యార్థి ఒకటి రాయపర్తి ఒకటి చర్లపల్లి విద్యార్థికి ఒకటి బహుమతులు తీసుకోవడం జరిగింది.
సమావేశానికి మండల విద్యాధికారి కె. హనుమంతరావు బహుమతులు ఇవ్వడం. ముఖ్య అతిథులుగా ఆర్డీవో రమణ పరకాల సిఐ క్రాంతి కుమార్ నడి కూడా మండల ఎమ్మార్వో కె. నాగరాజు నడికూడ అగ్రికల్చర్ ఆఫీసర్ మండల ఎండిఓ మరియు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో నన్నే సాబ్, రాజేంద్ర బాబు పోరిక రాజు నాయక్ మరియు మండలం లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app