SAKSHITHA NEWS

ఆఖరి రోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి …గొన్న రామదేవి

అనకాపల్లి జిల్లా పరవాడ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగియనుండడంతో ఇప్పటివరకు సభ్యత్వ నమోదు చేసుకోని వారు. త్వరపడాలని పెందుర్తి జనసేన నాయకులు గొన్న రమాదేవి అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల శ్రేయస్సు కోసం ఇప్పటివరకు ఇటువంటి కార్యక్రమం తలపెట్టలేదని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి కార్యకర్తకి ఎంతో అవసరం అన్నారు.

ముఖ్యంగా జిల్లాలో పెందుర్తి నియోజకవర్గం లో ఇప్పటి వరకు అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పూర్తి అవ్వడం సంతోషకరమన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెందుర్తి నియోజకవర్గాన్ని జిల్లాలో మొదటి స్థానంలో నిలవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పంచకర్ల రమేష్ బాబు మీద నమ్మకంతో ఎంతమంది సభ్యత్వాలు తీసుకోవడం చాలా సంతోషకరమన్నారు. కాబట్టి చివరి రోజు ఇంకా ఎవరైనా ఈ సభ్యత్వాలు తీసుకొని వారు ఉన్నట్లయితే తప్పనిసరిగా జనసేన పార్టీ సభ్యత్వ అని తీసుకొని మీకు మీ కుటుంబానికి భరోసానివ్వాలని ఆమె పిలుపునిచ్చారు


SAKSHITHA NEWS