రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి

Spread the love

Take advantage of revenue conferences

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు

ప్రజల సమక్షంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.

పటాన్చెరు మండల పరిధిలోని కర్ధనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడినంతరం భూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రవేశపెట్టారని అన్నారు. 90 శాతం భూ సమస్యలకు ధరణి పరిష్కారం చూపించిందని అన్నారు. చిన్న చిన్న సమస్యల కోసం కోర్టు మెట్లు ఎక్కి సమస్యలను జఠిలం చేసుకోవద్దని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో పరమేష్, గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page