SAKSHITHA NEWS

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు-తహశీల్దార్ హుస్సేన్

మురికి పూడి గ్రామంలో పర్యటించి న చిలకలూరిపేట ఎమ్మార్వో

రెవెన్యూ రికార్డులు లో ఉన్న భూములు పరిశీలించి న రెవెన్యూ బృందం

వాగు పోరంబోకు ,అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాo-తహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ షేక్

చిలకలూరిపేట మండలం
మురికి పూడి గ్రామ పరిధిలోని వాగు పోరంబోకు అసైన్డ్ భూములు క్రయ విక్రయాలు జరిపిన అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేసిన ఆక్రమణలకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మహ్మద్ హుస్సేన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

మండల పరిధిలోని మురికిపూడి గ్రామములో ఉన్న బొటు వీరాంజనేయ స్వామి వారి గుడి వెనుక కొండ పక్కనే ఉన్న సర్వే నెంబర్ 33-1-Z11 లో 128 ఎకరాల 72 సెంట్లు వాగు పోరంబాకు స్థలము ఉంది , ఆ స్థలములో 68 ఎకరాలు సుమారుగా 1953 సంవత్సరములో 60 మంది పేద ప్రజలకు సాగు చేసుకుని నిమిత్తము పట్టాలు ఇచ్చి ఉన్నారు .

మిగతా 60 ఎకరాలు గవర్నమెంట్ వారి ఆధీనంలో ఉంది . ఈ భూమిలో గ్రానైట్ నిలువలు ఉన్నాయి . అని పేద ప్రజలకు ఇచ్చిన 68 ఎకరాల పక్కనే గ్రానైట్ తవ్వుతుండగా గ్రామములోని కొంతమంది దొంగ పట్టాలు పుట్టించి 68 ఎకరాలలో మాకు కూడా పట్టాలు ఇచ్చినారు అని కోర్టు లో రిట్ పిటిషన్ వేసి ఉన్నారు.

మురికి పూడి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని కాజేయలని చుట్టూ మట్టి వేశారు. ఈ విషియం తెలుసుకున్న ఎమ్మార్వో ఆ భూమిని పరిశీలించారు. రెవెన్యూ రికార్డులు చూసి, ప్రభుత్వ భూమిగా నిర్ణయించారు.

ఈ భూమి ని కబ్జా చేయాలని చూస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.