ఫుల్ స్వింగులో NTR 30 ప్రీ ప్రొడక్షన్ పనులు
NTR 30 pre-production works in full swing ఫుల్ స్వింగులో NTR 30 ప్రీ ప్రొడక్షన్ పనులు.. ప్లానింగ్‌లో బిజీగా కొరటాల శివ అండ్ టీమ్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్…
NTR 30 pre-production works in full swing ఫుల్ స్వింగులో NTR 30 ప్రీ ప్రొడక్షన్ పనులు.. ప్లానింగ్‌లో బిజీగా కొరటాల శివ అండ్ టీమ్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్…
Bobby Simha as Solomon Caesar from ‘Waltheru Veeraiya’ Releases First Look మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ నుండి సోలమన్ సీజర్ గా బాబీ సింహా ఫస్ట్ లుక్ విడుదల మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా ఓ కీలక పాత్ర పోస్తున్నారు. బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ”సోలమన్ సీజర్”గా చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బాబీ సింహ లుక్ చాలా ఇంట్రస్టింగా వుంది. టక్ చేసుకున్న పూల చొక్కా, మెడలో బంగారు గొలుసులు, చేతికి బంగారు కడియం, గడియారం, నల్లటి కళ్ళజోడు తో బ్రైట్ వింటేజ్ లుక్ లో కనిపించారు బాబీ సింహ. ఫస్ట్ లుక్ చూస్తుంటే వాల్తేరు వీరయ్య లో ”సోలమన్ సీజర్” పాత్ర చాలా కీలకంగా వుండబోతుందని అర్ధమౌతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. నిరంజన్ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి సిఈవో: చెర్రీ…
Vaishnavi Films NS24 is off to a solid start నాగ శౌర్య, ఎస్.ఎస్ అరుణాచలమ్, వైష్ణవి ఫిల్మ్స్ #NS24 చిత్రం ఘనంగా ప్రారంభం ప్రామిసింగ్ హీరో నాగశౌర్య 24వ చిత్రానికి నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. #NS24 విశిష్ట అతిథుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైయింది. పూజా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు వివి వినాయక్ ముహూర్తం షాట్ కు క్లాప్‌బోర్డ్ ను ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్ కి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబశివారెడ్డి, జి.ఎస్.కె ఇన్ఫ్రా టెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. #NS24 నాగ శౌర్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందబోతుంది. యూత్, ఫ్యామిలీస్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉండే యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. #NS24లో కీలక పాత్రల్లోప్రముఖ తారాగణం కనిపించనుంది. అలాగే ఈ సినిమా కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, సాయి ప్రవీణ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్వి శేఖర్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. బండి భాస్కర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. తారాగణం: నాగ శౌర్య సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎస్.ఎస్ అరుణాచలమ్ నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్ సమర్పణ: బేబీ అద్వైత, భవిష్య సంగీతం: హారిస్ జయరాజ్ డీవోపీ: వెట్రి పళనిసామి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ ఆర్ట్: సాయి ప్రవీణ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: ఎస్.వి శేఖర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి భాస్కర్ పీఆర్వో: వంశీ-శేఖర్
In the post-production activities, the crime thriller Adharva.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో క్రైం థిల్లర్ అధర్వ.. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ. క్రైమ్ థ్రిల్లర్…
Warisu (Varasudu) released the first single Ranjithame దళపతి విజయ్- వంశీ పైడిపల్లి- దిల్ రాజు- వారిసు (వారసుడు) ఫస్ట్ సింగిల్ రంజితమే విడుదల దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’/ వారిసు సంక్రాంతి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటి. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక. ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమాపై భారీ బజ్ వుంది. సినిమా పోస్టర్ లు కూల్ గా, కలర్‌ఫుల్ గా కనిపించాయి. ఇందులో విజయ్, రష్మికల జోడి లవ్లీగా కనిపించింది. ఫస్ట్ సింగిల్ ప్రోమోతో ఆసక్తిని పెంచిన మేకర్స్ ఈ రోజు ఎంతగానో ఎదురుచూస్తున్న రంజితమే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న ఎస్ థమన్ ఈ పాట కోసం ఫుట్‌ట్యాపింగ్ నంబర్ ను స్కోర్ చేశారు. ఎమ్ ఎమ్ మానసితో కలిసి విజయ్ స్వయంగా హై బీట్, ఎనర్జిటిక్ గా పాడటం అద్భుతంగా వుంది. విన్న వెంటనే ఉత్సాహాన్ని పెంచుతోంది. విజయ్ వాయిస్ ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచింది. వివేక్ సాహిత్యం అందించారు. విజయ్, జానీ మాస్టర్ల కాంబినేషన్ సూపర్ హిట్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులకు విజయ్ డ్యాన్స్ చేయడం చూడటం ఎప్పుడూ ట్రీట్ గా ఉంటుంది. డ్యాన్స్‌లు ట్రెండీగా, గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. ఈ పాటలో రష్మిక మందన్న స్టన్నింగ్ గా కనిపించింది. సెట్టింగ్, బ్యాక్‌డ్రాప్‌లు వైబ్రెటింగా వున్నాయి. మొత్తంమీద ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే డ్యాన్స్ ట్రాక్. వైరల్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ పాటలో వున్నాయి. తెలుగు వెర్షన్ పాటను త్వరలో విడుదల చేయనున్నారు. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం: వంశీ పైడిపల్లి కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సంగీతం: ఎస్ థమన్ డీవోపీ: కార్తీక్ పళని ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్ డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్ ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్ మేకప్: నాగరాజు కాస్ట్యూమ్స్: దీపాలి నూర్…
Star director Gopichand Malineni released the teaser of Anand Ravi’s ‘Korameenu‘ ఆనంద్ రవి ‘కోరమీను’ టీజర్ విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి…
Thank you to the audience for supporting our movie “Bomma Black Bluster“. మా “బొమ్మ బ్లాక్ బ్లస్టర్” సినిమాను అదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : నిర్మాత బోసుబాబు నిడుమోలు విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నందు విజయ్‌కృష్ణ హీరోగా..…
Comedy Movies, Zee Studios, ‘Itlu Maredumilli Prajanikam’ Releases on 25th November అల్లరి నరేష్, ఏఆర్ మోహన్, హాస్య మూవీస్ ,జీ స్టూడియోస్, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నవంబర్ 25న విడుదల వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా టీజర్, మెలోడీ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది. నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా సంగీతం: శ్రీచరణ్ పాకాల డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: రాంరెడ్డి ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ స్టంట్స్: పృథ్వీ…
I am a big fan of Sivanageswara Rao – director Sukumar శివనాగేశ్వరరావుగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని– దర్శకుడు సుకుమార్ ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి ..అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రణవి సాధనాల టార్జాన్ జెమిని సురేష్ ముఖ్యపాత్రల్లో.కోట…
SSB Movie ‘Chicklets’ Youthful First Look Released by Director Srikanth Addala దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ఎస్ఎస్బి సినిమా ‘చిక్లెట్స్’ యూత్‌ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రాలను తీయడానికి దర్శకులు…