ఉత్తమ ఉపాధ్యాయుడి గా అవార్డ్ సునిల్

Spread the love

ఉత్తమ ఉపాధ్యాయుడి గా అవార్డ్ అందుకున్న సునిల్ కుమార్

హనుమకొండ

ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న ఇష్టం తో గౌరవంతో గత 15 సంవత్సరాలుగా వివిధ పాఠశాలలో వేలాదిమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా టి పి టి.ఎఫ్అధ్యక్షులు చంద్రగిరి సునిల్ కుమార్ ప్రతిష్టాత్మక శ్రీ రామానుజన్ ఫౌండేషన్ వారి “ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార్ అవార్డు కు ఎంపిక అయి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లో,తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలి చేతుల మీదుగా అవార్డ్ తీసుకుని, ఒకవైపు సమాజానికి బావిభారత ఉత్తమ పౌరులను తీర్చుదిద్దుతూనే మరోవైపు తనకున్న సామాజిక స్పృహతో , బాధ్యతతో తన వృత్తిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై టి పి టి ఎఫ్ వేదిక ద్వారా తనదైన శైలిలో చురుకుగా పనిచేస్తున్న తనకు ఈ అవార్డు రావడం తన కృషికి నిదర్శనం. భవిష్యత్తు లో కూడా తన ఉపాధ్యాయ సేవలను కొనసాగిస్తూ , సమాజంలో మంచి భాద్యతాయుతమైన నాయకుడిగా ఎదిగి , ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగుతూ విజయం సాధించాలనీ కోరుకుంటూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ అలీ,ప్రధాన కార్యదర్శి నిరుపమ, ఉపాధ్యక్షులు శివరాజ్,అధికార ప్రతినిధి రామారావు,రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేష్ ప్రత్యేక హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page