SAKSHITHA NEWS

పారిపోయి కొండల్లో దాక్కున్న విద్యార్థులు!

AP: పల్నాడు (D) వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు. మరో 37మంది కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని, బాత్రూంలు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండటంతో వారు పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app