
విద్యార్థులు అన్ని క్రీడా పోటీలలో రాణించాలి..
దుండిగల్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ లో ఏర్పాటు చేసిన దుండిగల్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని క్రీడల్లో సైతం రాణించాలని ఆకాంక్షించారు. ప్రతిరోజు ఒక గంట సేపు ఏదో ఒక క్రీడల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, అమరం గోపాల్ రెడ్డి, జక్కుల శ్రీనివాస్ యాదవ్, కొర్ర శంకర్ నాయక్, మాజీ సర్పంచ్ కావలి గణేష్, మాజీ ఎంపీటీసీ బండర్ మహేష్, పిఎసిఎస్ డైరెక్టర్ జితయ్య, సీనియర్ నాయకులు కొర్ర రవి నాయక్, యువకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app