SAKSHITHA NEWS

తెలంగాణ మలిదశఉద్యమ విద్యార్థి నాయకులు ఉదయ్ కిరణ్ అంతిమ యాత్రలో పాల్గొన్న……….*మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి …..

  • అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించిన B.R.S.V రాష్ట్ర అధ్యక్షులు.. …… గెల్లు.శ్రీనివాసయాదవ్ సాక్షిత వనపర్తి ఆగస్టు 6 తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి నాయకులు ఉదయ్ కిరణ్ చారీ అంతిమ యాత్రలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
    ఈ సందర్భంగా విచక్షణ కోల్పోయిక్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబసభ్యులకు తీరని వేదన కలిగించిన వాళ్ళు అవుతారని ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు యువత తీసుకోకుండా ఆత్మస్థైర్యంతో సమస్యలు ఎదురుకోవాలని అన్నారు.

  • బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు గెళ్లు.శ్రీనివాసయాదవ్ ఉదయ్ కిరణ్ అంతిమయాత్రలో పాల్గొని పాడేమోసి నివాళులు అర్పించారు.
    నిరంజన్ రెడ్డి వెంట జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్, జె.యేసి మాజీ చైర్మన్ వేణు గోపాల్,సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి ప్రేమ్ నాథ్ రెడ్డి,సూర్యవంశపు. గిరి,హేమంత్ ముదిరాజ్,చిట్యాల.రాము గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

SAKSHITHA NEWS