
శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో కాపు బలిజ సంఘం ఉభయంలో ఆకుపాటి కుటుంబ సభ్యుల మహా అన్నదాన కార్యక్రమం
కనిగిరి సాక్షిత : కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కాపు బలిజ సంఘం వారి ఉభయంలో ఉదయం 7 గంటలకు స్వామివారికి విశేష పూజలు, 8.30 నిమిషములకు మోహిని అవతారంలో స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా, భేతాళ నృత్య ప్రదర్శన, కనక తప్పెట్లు, నవ్వుల ప్రదర్శన, బాణసంచా, పండు ఈవెంట్స్, డిజె సౌండ్ సిస్టం లతో కాపు బలిజ సంఘం వారు నిర్వహించారు. దేవస్థానములో మధ్యాహ్నం ఆకు పాటి రమణయ్య, శ్రీమతి రాములమ్మ, ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ దంపతులు, ఆకుపాటి డాక్టర్ కిషోర్ దంపతుల సారధ్యంలో 5000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాపు బలిజ సంఘం నాయకులు గుర్రం వెంకటేశ్వర్లు, ఉప్పలపాటి హరిబాబు,గుత్తి వెంకటరాజా, వరి కూటి చిరంజీవి, శ్రీరామ్ శ్రీనివాసులు, కొండా నరసింహులు, గద్దె ఏడుకొండలు, బండ్ల నారాయణ, చలివేంద్రం సుబ్బారావు, నరసింగు సాంబశివరావు,పాలపర్తి వెంకటేశ్వర్లు, వాయినేని రాఘవ, నీరుకట్టు నాయబ్ రసూల్ తదితర కాపు బలిజ సంఘం వారు ఉభయం ఏర్పాట్లను ఆద్యాంతం పర్యవేక్షించారు.
