SAKSHITHA NEWS

ఘనంగా ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ వార్షికోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామరం లో గల శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ వార్షికోత్సవలలో ముఖ్య అతిధి గా పాల్గొన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ఈ సందర్బంగా పాఠశాల యాజమాన్యం సొంటిరెడ్డి పున్న రెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలనచేశారు.చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించారు.అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ విద్యతో పాటు చిన్నతనం నుంచే విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, అలాంటప్పుడే రానున్న రోజులలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని స్పష్టం చేశారు. విద్యతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు క్రీడలలో కూడా పాల్గోనేలా ప్రోత్సహించాలని, చిన్నారుల ప్రతిభను ముందే గుర్తించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీధర్ వర్మ ,సతీష్ ,దొర అరుణ్ గఫ్ఫార్ ,రహీం తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app