క్రీడాస్ఫూర్తి ప్రతీక ఒలంపిక్ డే రన్
ఐక్యతకు,శాంతికి, క్రీడాకారులకు ప్రోత్సాహకానికి ఒలింపిక్ డే రన్
క్రీడల్లో రాణిస్తూ తోనే ప్రత్యేక గుర్తింపు
క్రీడా మైదానాల తో తెలంగాణ రాష్ట్రం క్రీడలకు పెద్దపీట
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
క్రీడాస్ఫూర్తి కి ఒలంపిక్ డే రన్ అని కోదాడ అభివృద్ధి ప్రదాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా ఒలంపిక్ డే రన్ కన్వీనర్ నామ నరసింహ రావు ఆధ్వర్యంలో కోదాడ బాలుర ఉన్నత పాఠశాల నుండి ఒలింపిక్ డే రన్ ను ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….. ఐక్యతకు శాంతికి, క్రీడాకారుల్లో ప్రోత్సాహానికి ఒలింపిక్ డే రన్ దోహదపడుతుందన్నారు. క్రీడల్లో రాణిస్తూ తోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్రీడా మైదానాలు ఏర్పాటుచేసి క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తుదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉండి వెలుగులోకి రాని ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని ప్రభుత్వం వారికి ప్రోత్సాహం ఇచ్చి ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలనుండి కూడా ఒలంపిక్ గేమ్స్ లో కోదాడ ప్రాంత క్రీడాకారులను పథకాలు సాధించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలకు క్రీడాకారులకు తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు. కాగా ఒలంపిక్ డే రన్లో క్రీడా సంఘాల ప్రతినిధులు అధికారులు క్రీడాకారులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని కోదాడ బాలుర ఉన్నత పాఠశాల నుండి రంగా థియేటర్ వరకు స్ఫూర్తిదాయకమైన పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపి కవిత రాజారెడ్డి, ఎంఈఓ సలీం షరీఫ్, టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి,వెంపటి మధుసూదన్, సంపేట ఉపేందర్ గౌడ్, గుండెల సూర్యనారాయణ,క్రీడాకారులు,మరియు, PET లు కళ్యాణ్, కొండల్, నాగిరెడ్డి, ప్రదీప్, రమేష్ బాబు,భయ్యా రవి, సైదులు, మటయ్య,వినయ్, నాగరని,అర్జున్,నీరజ, మల్లిక,వేణు, కళ్యాణ్ పాల్గొన్నారు…

