SAKSHITHA NEWS

ఎస్పీ సుధీర్ రంనాథ్ కేకన్ IPS మహబూబాబాద్ చరిత్రలో మీకో కొన్ని పేజీలుంటాయి…

మహబూబాబాద్ అద్భుతమైన క్రీడామైదానాన్ని సృష్టించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్…

ఈనెల 21,22,23 తేదీలలో జిల్లా పోలీస్ శాఖ క్రీడోత్సవాల (పోలీస్ డ్యూటీ మీట్) నిర్వాహణకు ముమ్మరంగా ఏర్పాట్లు…

ఇప్పటికే సకల హంగులతో సిద్ధమైన పోలీస్ క్రీడా మైదానం..

క్రీడోత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పిచ్..

కబడ్డీ, వాలీబాల్, టెన్నికాయిట్ కోర్టులు సిద్ధం…

పరుగుపందెం ల నిర్వాహణకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు…

హైజెంప్, లాంగ్ జంప్, షాట్ ఫూట్, జావెలిన్ త్రో వంటి అనేక క్రీడాంశాల నిర్వాహణకు ప్రత్యేక ఏర్పాట్లు..‌

ఈనెల 21,22,23 తేదీలలో మూడు రోజులపాటు మహబూబాబాద్ పోలీస్ క్రీడామైదానం లో ఘనంగా జరగనున్న క్రీడోత్సవాలు…

పోటీలను తిలకించేందుకు ప్రజలందరికీ అవకాశం కల్పించే ఆలోచనలో జిల్లా పోలీస్ యంత్రాంగం

ఎందరో… అధికారులు వస్తుంటారు.., బదిలీపై పోతుంటారు కానీ కొందరిని మాత్రమే ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు…

ప్రెండ్లీ పోలీసింగ్ తో జిల్లాలో ఇప్పటికే ప్రజలకు అత్యంత చేరువైన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఎవ్వరి అంచనాలకు కూడా అందని తరహాలో గొప్ప క్రీడా మైదానాన్ని సృష్టించడం ద్వారా జిల్లా ప్రజల హృదయాల్లో తన బలమైన ముద్రను మరోమారు వేసారు.

పోలీస్ శాఖ క్రీడోత్సవాలు నిర్వహించడం ద్వారా జిల్లా పోలీస్ యంత్రాంగంలోను నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపనున్నా రు..

శాంతి భద్రతల పరిరక్షణ, అక్రమవ్యాపారాల నివారణ, అక్రమరవాణాకు బలమైన అడ్డుకట్ట, ప్రజా చైతన్య, సహాయ కార్యక్రమాల నిర్వహణ, జిల్లా పోలీస్ కార్యాలయంలో నిరంతర ప్రజాదర్బార్, సమస్యలపై తక్షణ స్పందన.. ఇలా ప్రతి అంశంలోనూ తనదైన ప్రత్యేక ముద్ర తో జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్న జిల్లా పోలీస్ బాస్ సుధీర్ రాంనాద్ కేకన్ IPS …. ఖచ్చితంగా మీకు మానుకోట చరిత్రలో కొన్ని పేజీలు ఉంటాయి.