SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భూ రిజిస్ట్రేషన్ సమస్యలకు పరిష్కారం చేయాలని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమావేశం అయ్యారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో కొన్ని కాలనీల్లో వక్ఫ్ బోర్డ్ స్థలాల నెపం చూపిస్తూ, సర్వేనెంబర్ 58 నుండి 226 వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకుండా సబ్ రిజిస్ట్రార్ నిలిపివేయడంతో, దానిని పునరుద్దరించాలని కోరుతూ శనివారం మినిస్టర్ క్వార్టార్స్ లో రెవిన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వినతిపత్రం అందజేశారు.
అనుమతులతో పాటు సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నా, రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం పట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి శ్రీశైలం గౌడ్ వివరించారు. ఈ సమస్యపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కి ఆదేశాలు జారీ చేశారు. యథాతతంగా రిజిస్ట్రేషన్లు అయ్యేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు శ్రీశైలం గౌడ్ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో దుర్గారావు,అప్పారావు,వెంకట రమణయ్య,ఓబుల్ రెడ్డి,సత్యం,హర్షారెడ్డి, రాజేష్, రాజివ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS