SAKSHITHA NEWS

రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు…. ట్రాఫిక్ కు అవాంతరాలు సృష్టించొద్దు: ట్రాఫిక్ ఎస్.ఐ ప్రసాద్

గుడివాడ పట్టణంలోనీ ప్రధాన రహదారులు వెంబడి ట్రాఫిక్ అవాంతరాలకు కారణమవుతున్న తోపుడుబల్లపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రోడ్ల మీదకు వచ్చిన తోపుడుబళ్లను ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చిరు వ్యాపారాలు నిర్వహించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

తాము చిరు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదని…. రోడ్లపై ఉన్న తోపుడుబళ్లను ట్రాఫిక్ కు ఇబ్బందుల తలెత్తకుండా పక్కకు మాత్రమే జరుపుతున్నామని ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ తెలియజేశారు. పట్టణంలో వాహనాల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో వాహనదారులతో పాటుగా, చిరు వ్యాపారులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మారిన ట్రాఫిక్ చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.

శాసనసభ్యులు ప్రవేశపెట్టిన ఐలవ్ గుడివాడ ప్రాజెక్టులో తాము కూడా భాగస్వామ్యం అవుతు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై ప్రసాద్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రత్నరాజు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS