SAKSHITHA NEWS

బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
యూజీసీ నెట్ పరీక్షల నేపథ్యంలో టీఎస్ సెట్ ఎగ్జామ్ షెడ్యూల్ మారింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని సెట్ అధికారులు ప్రకటించారు.

గతంలో ఈనెల 28 నుంచి 31 వరకూ జరగాల్సిన పరీక్షలను.. సెప్టెంబర్ 10 నుంచి 13 వరకూ నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎడిట్ ఆప్షన్‌ను ఆగస్టు 23, 24 తేదీల్లో నిర్వహిస్తామని, హాల్ టికెట్లను సెప్టెంబర్ 2 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.


SAKSHITHA NEWS