SAKSHITHA NEWS

ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేసి లైసెన్స్ లేని డ్రైవర్లను కఠినంగా శిక్షించాలని…….. ఆర్టీవో కు వినతి పత్రాన్ని అందచేసిన విద్యార్థి సంఘాలు

సాక్షిత వనపర్తి

DYFI, PDSU, AIYF విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలిసి ఆర్టీవో కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది

ఈ సందర్భంగా DYFI జిల్లా అధ్యక్షులు T. రాఘవేంద్ర, PDSU జిల్లా అధ్యక్షులు వెంకటేష్, AIYF జిల్లా కార్యదర్శి కుతుబ్ లు మాట్లాడుతూ
వనపర్తి జిల్లాలోని వివిధ మండల కేంద్రంలో ప్రైవేటు స్కూలలో పిట్నెస్ లేని బస్సులను అలాగే లైసెన్స్ లేని డైవర్స్ ను తొలగించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విన్నవించడం జరిగింది
తమ పిల్లలు భవిష్యత్ లో బాగా చదవాలని తమ విద్యార్థులను ప్రైవేటు స్కూల్ లో వేలకు వేలు డబ్బులు డొనేషన్ చేసి చదివిస్తూ ఉంటే అక్కడ ఉన్న యాజమాన్యం వాళ్ళు మాత్రం లైసెన్స్ డ్రైవర్స్ కొనసాగిస్తూ వచ్చేరాని డ్రైవింగ్ చేస్తూ విద్యార్థులు చావుకు కారణం అవుతున్నారు కనుక మీరు ప్రైవేటు స్కూల్ కోసం దానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థి ఉద్యమ సంఘాలుగా డిమాండ్ చేయడం జరిగింది
లేని యెడల ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతామన్నీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్ధి యువజన సంఘాల సభ్యులు పాల్గొనారు