SAKSHITHA NEWS

పదవితో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయాలి : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనకు పదవులు అడ్డుకావని, పదవులతో సంబంధం లేకుండా నాయకులు ప్రజల్లో తిరిగినప్పుడే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందన్నారు.

అనంతరం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ లను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నిజాంపేట్ కార్పొరేషన్ అభివృద్ధికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వెచ్చించిన నిధులు, చేసిన సంక్షేమం గురించి వారు మాట్లాడుతూ…ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సహాయ, సహకారాలతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, పదవులు ఉన్నాలేకున్నా ప్రజల కోసమే పని చేస్తామని అన్నారు. తమ రాజకీయ గురువు అయిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారికీ జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రజిత రవికాంత్, రవి కిరణ్, గాజుల సుజాత, ఆగం రాజు, కాసాని సుధాకర్ ముదిరాజ్, పైడి మాధవి, రాఘవేంద్ర రావు, బొర్రా దేవి చందు ముదిరాజ్, కో-ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి, సయ్యద్ సలీం తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app