SAKSHITHA NEWS

అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకం దారుల సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి

ఖమ్మం : అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కురుమ యాదవుల , గొర్రెల పెంపకం దార్ల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ , జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ , జిల్లా యాదవ ఉద్యోగుల అధ్యక్షులు దుబాకుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు . ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ప్రకటించినట్లుగా గొర్రెల పెంపకం దారులకు నగదు బదిలీ చేయాలని , యాదవులకు చట్టసభలలో జిల్లా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని , రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో యాదవులకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వాలని , ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఆ ప్రకటించాలని ,

ఎన్సీడీసీ స్కీమును పునరుద్ధరించాలని , గత ప్రభుత్వం ఎస్ ఆర్ డి పి పథకాన్ని రెండో విడత ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిందని , ఆగిపోయిన వారికి స్కీమును కొనసాగించాలని , కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలకు గొర్రెలకు బదులు పాడి గేదెలు మంజూరు చేయాలని , తదితర సమస్యలపై మంత్రి కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని . దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి అతి తొందరలో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో చేతుల నాగేశ్వరరావు , మొరి మేకల కోటయ్య , కనక బండి విజయలక్ష్మి , బొమ్మిడి శ్రీనివాస్ , నన్నే బోయిన పద్మ , తుప్పాత్ రవికుమార్ కురుమ , ముత్తయ్య కురుమ , గజ్జి సూరిబాబు యాదవ్ , అంగడాల నరసింహారావు , మంద నాగేశ్వరరావు , జాల నరసింహారావు , పొదిలి సతీష్ , బండారు ప్రభాకర్ , వాకదాని కోటేశ్వరరావు , బొల్లి కొమరయ్య , జోనబోయిన పాపయ్య , పొదిలి భూపతి , తోడేటి లింగరాజు , మారుతి ఎట్టయ్య , కాసు మల్లేష్ , మేడిదల మల్లేష్ , రాగం బాబురావు , సత్తి వెంకన్న , మెండే వెంకటేష్ , రాధాకృష్ణ యాదవ్ మరియు తదితర యాదవ నాయకులు పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app