SAKSHITHA NEWS

భ‌క్తుల‌కు సేవ చేయ‌డం అంటే త్రికోటేశ్వ‌ర‌స్వామివారి కి సేవ చేయ‌డ‌మే
భక్తి మార్గంలో నడుస్తూ సేవా తత్పరతను చాటు కుంటున్న చ‌ర‌ణ్‌తేజ‌
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు
జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో అల్పాహార కేంద్రం ప్రారంభం

చిల‌క‌లూరిపేట‌:
భ‌క్తుల‌కు సేవ చేయ‌డం అంటే త్రికోటేశ్వ‌ర‌స్వామికి సేవ చేయ‌డ‌మేన‌ని జ‌న‌సేన యువ‌నాయ‌కులు మండ‌ల‌నేని చ‌ర‌ణ్‌తేజ చెప్పారు. కోట‌ప్ప‌కొండ‌కు వెళ్లే భ‌క్తుల‌కు కొత్త బైపాస్ రోడ్డు వ‌ద్ద జ‌న‌సేన పార్టీ చిల‌కలూరిపేట ఇన్‌చార్జి తోట రాజార‌మేష్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు అల్పాహార కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావుతో క‌ల‌సి చ‌ర‌ణ్‌తేజ బుధ‌వారం ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు అల్పాహార కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉండ‌గా, అక్క‌డే ఉన్న చ‌ర‌ణ్‌తేజా చేత ప్రారంభింప చేశారు. శాలువ‌తో స‌త్క‌రించి చ‌ర‌ణ్‌తేజ‌ చిన్న వ‌య‌సులోనే భక్తి మార్గంలో నడుస్తూ సేవా తత్పరతను చాటు కోవ‌డం అభినంద‌నీయ‌మి కొనియాడారు. సమాజంలో ప్రతీ ఒక్కరు సేవ భావంతో మెలగాలని సూచించారు. భక్తి భావంలో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. అన్నిదానాల కన్న అన్నదానం ఎంతో గొప్పదని, పేదల ఆకలిని తీర్చేందుకు అందరు తమవంతు తోడ్పాటు అందించాలన్నారు. సేవా భావం పెంపొందేలా చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలను యువ‌త‌కు స్పూర్తిగా తీసుకోవాల‌ని సూచించారు.


ఈ సంద‌ర్బంగా జ‌నసేన యువ‌నాయ‌కులు మండ‌ల‌నేని చ‌ర‌ణ్‌తేజ మాట్లాడుతూ సామాజిక స్పృహతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేన పార్టీ ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం ఏర్పాటు చేసుకొంద‌ని వెల్ల‌డించారు. అల్పాహార కేంద్రాన్ని ఏర్పాటు చేసిన జ‌న‌సేన పార్టీ ఇన్‌చార్జి తోట రాజార‌మేష్‌ను అభినందించారు. జ‌న‌సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో జ‌న‌సైనికులు చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కార్య‌క్ర‌మంలో,చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ గారు, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు , ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార అధ్యక్షులు షికా బాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రెటరీ షేక్ సుభాని, పట్టణ అధ్యక్షులు షేక్ మునీర్ హసన్, రూరల్ మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, నాదెండ్ల మండల అధ్యక్షులు దడదాసుల శరత్, నియోజవర్గ ఎమ్మెల్సీ పరిశీలకులు పోలిరెడ్డి దినేష్ రెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముల్లా, కందుల రమణ, గంగా శీను, పట్టణ టిడిపి నాయకులు తదితరులు మరియు జనసేన వీర మహిళలు, స్వామి జాగ్గు రోతి, అక్కి శెట్టి మురళి, గుంజి వీరాంజి, మరియు చరణ్ టీం తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app