SAKSHITHA NEWS

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్.

సాక్షిత పిడుగురాళ్ల : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచి సూపర్ సిక్స్ పధకాలు వైఫల్యం చెందగా దానికి నిరసనగా వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం రాష్ట్రం అంతటా విజయవంతం కావడంతో దాన్ని కప్పి పుచ్చుకోవడానికి సాక్షి ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ను అక్రమ అరెస్ట్ చేశారని వైసీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆరోపించారు. ఈ సందర్బంగా సోమవారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో కొమ్మినేని అక్రమ అరెస్టును వైసీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇటీవల జరిగిన ఒక డిబేట్ కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ రోజే వైసిపి, సాక్షి ఛానల్ తరపున ఖండించామని గుర్తు చేశారు. ఎవరో ఒక వ్యక్తి చేసిన విమర్శలతో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు పై అధికార పార్టీ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. గత ఏడాది కాలంగా జరిగిన ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి అందుకు నిరసనగా వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం సక్సెస్ అయిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికే శ్రీనివాసరావు మీద తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. నేటికైనా కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ హితవు పలికారు.