SAKSHITHA NEWS

ఘనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

సాక్షిత మోతే ప్రతినిధి : మోతె మండలం రావిపహాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం, పరిపాలనా వ్యవస్థపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పొడపంగి మనుశ్రీ జిల్లా కలెక్టర్ పాత్రలో బాధ్యతలు స్వీకరించగా కుశనపల్లి ప్రణయ్ కుమార్ గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించాడు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులను బోధించి, పరిపాలనా విధానాలను అనుభవంగా నేర్చుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు నాయకత్వం, సమాజ సేవ భావనలను అలవర్చేందుకు ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app