SAKSHITHA NEWS

సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..పోలీసులకు ఫిర్యాదు

మంత్రి సత్య కుమార్ యాదవ్ పై గత వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ గుంటూరు ఎస్పీకి పిర్యాదు చేసారు. 2023లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తుండగా, అప్పటి ఎంపీ నందిగం సురేశ్ మరియు మరికొందరు దాడికి యత్నించారని పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసుల వద్ద ఫిర్యాదు చేసినప్పటికీ, ఫిర్యాదును స్వీకరించలేదని సురేశ్ ఆరోపించారు. ప్రస్తుతం, గుంటూరు ఎస్పీ తాజా ఫిర్యాదును స్వీకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) నేత సురేశ్ రాజకీయంగా యాక్టివ్ ఉన్న యువనాయకుడు. ఆయన బీజేపీకి చెందిన యువ నాయకత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. సురేశ్ తరచుగా రాజకీయ, సామాజిక అంశాలపై బలమైన వైఖరిని ప్రకటిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటాడు.


SAKSHITHA NEWS