
పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలని
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ
పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలని అధికారులను ఆదేశించారు. మైనర్, మీడియం, మేజర్ డ్రైన్ లన్ని డీసిల్టింగ్ పనులని పూర్తి చేయాలని అన్నారు. నగరాన్ని గుంతలు రహిత నగరంగా తీర్చిదిద్దాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్ల డీసిల్టింగ్ పాట్ హోల్స్ నిర్వహణ జరుగుతుండాలని అధికారులని ఆదేశించారు.
నగర సౌందర్యాన్ని భంగం చేసే సర్వీస్ ప్రొవైడర్ల వైర్లను పరిశీలించి వాటిని తొలగించాలని, నగర అందాన్ని మెరుగుపరిచేందుకు నమూనాగా ఒక రోడ్డుని వైర్ లు లేకుండా భూగర్భం నుండి వెళ్లేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
రెవెన్యూ శాఖ, ప్రజారోగ్యం శాఖల సమన్వయంతో కమర్షియల్ టాక్స్, టౌన్ ప్లానింగ్ శాఖ సమన్వయంతో ఖాళీ స్థలాల నుండి హౌస్ టాక్స్ కు మారిన పనుల వివరాలు, ఇంజనీరింగ్ శాఖ సమన్వయంతో నీటి పన్ను వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పన్నులను వసూలు చేయాలని కమిషనర్ అన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, ప్రభుదాస్, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఎగ్జామినేటర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, ఎకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app