న్యూ ఇయర్ వేడుకల్లో తస్మాత్ జాగ్రత్త : ఎస్ బాలు నాయక్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : నూతన సంవత్సర వేడుకల పేరుతో ఇతరులకు అసౌకర్యం కలిగే విధంగా ప్రవర్తిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట రూరల్ ఎస్సై బాలునాయక్ హెచ్చరించారు.
సూర్యాపేట రూరల్ పోలీసు శాఖ తరుపున మండల ప్రజలకు ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని క్రింది సూచనలను పాటించవల్సిందిగా పోలీసులు తెలిపారు.
- నూతన సంవత్సర వేడుకలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తుంది.
- నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం కూడా విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా కోరారు.
- ముఖ్యంగా తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు, బైకులు, కార్లను ఇస్తే వారు ఆ వాహనాలను వేగంగా, నిర్లక్ష్యంగా, మద్యం, మత్తులో నడపడం వలన ప్రమాదాలుజరిగే అవకాశం ఉంది. • కావున ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, సాధ్యమైనంత వరకు పిల్లలను కట్టడి చేసుకొవాలి.
- న్యూ ఇయర్ సందర్భంగా “డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసేందుకు, సూర్యాపేట రూరల్ పోలీస్ వారు చర్యలు చేపట్టారు అతివేగం/ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు, త్రిబుల్ రైడింగ్ నడిపే వారి కొరకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
- అన్ని కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు న్యూసెన్స్ చేసే వారిపై చర్యలు తీసుకోబడును.
- 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ పౌరులను అసౌకర్యం కలిగే విధంగా తిరిగే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.
- ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంట లోపు పూర్తిచేసుకుని తమ ఇళ్లకు వెళ్లాలని కోరుచున్నాము.
- అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది
కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, లేక ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. - నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని, ప్రజల రక్షణ కొరకు, పోలీసుల ఆధ్వర్యంలో అదనపు సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
- నూతన సంవత్సర వేడుకల గురించి ఎవరికి ప్రత్యేకమైన కార్యక్రమాలకు లేదా ఈవెంట్లకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదన్నారు.
- ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఈవెంట్స్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి.
- అంతే కాకుండా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాల పేరుతో, టికెట్లు/ఎంట్రీ ఫీజుల రూపంలో ప్రజల నుంచి డబ్బ్బలు వసూలు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
- డి జె సౌండ్ సిస్టమ్స్ పెట్టి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ, రోడ్డుపై కేకులు కటింగ్ చేయడం, వృద్దలకు, పేషంట్లకు, గర్భవతులకు, పిల్లలకు ప్రాణహాని కలిగే విధంగా చేసే వారిపై కఠిన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి, వాహనాలను/ఎక్విప్మెంట్ ను సీజ్ చేసి జైలుకు పంపే విధంగా చర్యలు తీసుకొనబడును.
- కావున పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ సూర్యాపేట రూరల్ పోలీసు వారితో సహకరించి పూర్తి శాంతియుత, ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.