SAKSHITHA NEWS

బడ్జెట్ లో తెలంగాణ రైల్వేకు రూ “5,337 కోట్లు

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగా ణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. తాజా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టు లకు మొత్తం రూ.5,337 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

సాయంత్రం ఢిల్లీలో రైల్వేశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. అయితే, తాజా కేటాయిం పులు.. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రతీయేటా కేటాయించిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ అని, యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీకి యేటా సగటున రూ.886 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెప్పారు.

తెలంగాణలో గత పదేళ్లలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు రూ.41,677 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అయితే, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి తెలంగాణలో 753 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే ట్రాకులు నిర్మించడం జరిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో 100శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తయింద ని, 453 ప్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మితమయ్యాయ యని చెప్పారు. రాష్ట్రంలో 48 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించడం జరిగిందని, 62 లిఫ్ట్ లు, 17 ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు జిల్లాల మీదుగా ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపిన మంత్రి.. తెలంగాణలో ప్రధానమైన సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు రూ.1,042 కోట్లు మంజూ రు చేయడం జరిగిందని తెలిపారు.

అందులో రూ.715 కోట్లతో సికింద్రాబాద్, రూ. 327 కోట్లతో హైదరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు ప్రోగ్రేస్ లో ఉన్నాయని, తెలిపారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app