
రోడ్డు ప్రమాదం:ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
సాక్షిత : తెల్లవారుజామున మార్టూరు పట్టణంలో దుర్గా మల్లేశ్వర కళ్యాణ మండపం ఎదురు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుండి చిలకలూరిపేట జాతీయ రహదారి NH16 పై ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని అదుపుతప్పిన టాటా సఫారీ వాహనం ఢీకొని ధ్వంసం అయింది. సమాచారం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసు లు క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రులు నూజివీడు కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app