Read Time:2 Minute, 38 Second
అశ్వారావుపేట పట్టణంలోని ఓ భూమి వ్యవహారంలో తగరం అక్కులయ్య అనే వ్యక్తికి రెవెన్యూశాఖ అధికారులకు మధ్య ఘర్షణ తలెత్తింది.రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా చెబుతున్న 5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది.
వాయిస్ ఓవర్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట పట్టణం నుండి సత్తుపల్లి వెళ్లే రహదారికి ఆనుకుని ఉన్న
5 ఎకరాల స్థలాన్ని గత కొంతకాలంగా పేరాయిగూడెం గ్రామానికి చెందిన తగరం అక్కులయ్య అనే వ్యక్తి తనకు వారసత్వ ఆస్థిగా చెబుతున్నాడు.రెవెన్యూశాఖ అధికారులు మాత్రం సదరు 5 ఎకరాల భూమిని 1976 సంవత్సరంలో ప్రభుత్వం IDC సంస్థకు కేటాయించిందని,IDC సంస్థ నిర్వీర్యం తర్వాత ఆ భూమిని వ్యవసాయ శాఖకు మార్కెట్ యార్డ్ నిర్మించుకునేందుకు అప్పజెప్పారని చెబుతున్నారు.
ఈ వివాదం హైకోర్టుకి చేరడంతో గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తోందని,కాగా ఇటీవల కాలంలో తగరం అక్కులయ్య కౌంటర్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసిందని రెవెన్యూశాఖ అధికారులు చెబుతున్నారు. భాదితుడు అక్కులయ్య మాత్రం కోర్టులో కేసు ఇంకా నడుస్తోందని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూశాఖ అధికారులు తన భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెబుతున్నారు.రెవెన్యూ అధికారులు స్థలాన్ని చదును చేసేందుకు జేసీబీని రప్పించగా అక్కులయ్య అతని భార్య జేసీబీకి అడ్డుపడ్డారు.దీంతో పోలీసులు అడ్డుకుని అక్కులయ్య ని పోలీస్ స్టేషన్ కి తరలించారు.
బైట్స్:
1) చల్లా ప్రసాద్ (తహశీల్దార్, అశ్వారావుపేట)
2) తగరం అక్కులయ్య (భాదితుడు)