రిటైర్డ్ హోంగార్డ్ కు 4,93,450 ఆర్ధిక సహాయం అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

Spread the love

రిటైర్డ్ హోంగార్డ్ కు 4,93,450 ఆర్ధిక సహాయం అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో హోంగార్డ్ గా 39 సంవత్సరాలు సుదీర్ఘంగా నిబద్దతతో విధులు నిర్వర్తించి పోలీస్ ఉన్నతాధికారులు అభినందనలు పొందుతూ 30.06.2022 తేదీన పదవీ విరమణ పొందిన యం. కృష్ణయ్య (HG-55) కుటుంబానికి అండగా ఉంటుడకు జిల్లాలోని హోంగార్డులు అందరూ కలసి వారి యొక్క ఒక్కరోజు వేతనం రూ.4,93,450/- ల చెక్కును పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదగా అందజేసినారు.

ఈ సందర్బంగా ఎస్పీ హోమ్ గార్డ్ యొక్క కుటుంబ పరిస్ధితులు మరియు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. స్వీయ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. వారికి అందజేసిన ఆర్ధిక సహాయమును చక్కని ప్రణాళికతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏవో యం.సులోచన, హోం గార్డ్ RI SK.మౌలిధిన్, డీపీఓ క్లర్క్ SK.రమీజా సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page