SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట కాలనీ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వివేకానంద నగర్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగినది.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే అడ్డగుట్ట కాలనీ లో పర్యటిస్తానని, అడ్డగుట్ట కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. త్వరలనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని రోడ్ల ను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల పనులు వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగేలా చూడలని అధికారులకు తెలియచేసారు.

అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో అడ్డగుట్ట కాలనీ వాసులు సుబ్బారావు, సత్యనారాయణ రాజు, వేణు మనోహర్ రెడ్డి, శివాజీ బాబు, రంగరాజు, వేణు గోపాల్, శ్రీనివాస్ రాజు, ఉమపతి,వెంకటేశ్వరరావు, పరమేశ్వర్, విశ్వనాథ్ రాజు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app