SAKSHITHA NEWS

పంచాయితీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి : గిద్దె రాజేష్

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లగంతులు కట్టుకొని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టిస్తామని ఉద్ఘాటన*
పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు

కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ పండరి మరియు సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లగంతులు కట్టుకొని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తరబడి వికలాంగుల ఓట్లతో గద్దనేక్కిన సకలాంగుల ప్రజాప్రతినిధులు చట్టసభల్లో వికలాంగుల సమస్యలపై చర్చించకుండా వికలాంగుల సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా వికలాంగుల సంక్షేమాన్ని అడుగడుగున విస్మరిస్తుండడంతో వికలాంగుల సమాజానికి విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్టసభల్లోను రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నామని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తరబడి సకలాంగుల పాలకొల చేతుల్లో విపక్షకు గురవుతున్న వికలాంగులకు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి తమ నిరసనను వ్యక్తం చేస్తామని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిన్న చూపు చూస్తూ అన్ని రంగాల్లోనూ విస్మరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వికలాంగుల పట్ల తన వివక్ష విడనాడి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా తమ యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తాము ఈ ప్రకటన చేస్తున్నామని పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజస్థాన్ చతిస్గడ్ రాష్ట్రాల్లో వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చిన మాదిరిగాని తెలంగాణలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని మాయమాటలు చెప్పి వికలాంగుల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు నేడు ఆ విషయాన్ని మరిచారని తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతూ దుర్బర జీవితాలు గడుపుతున్నారని అలాంటి వికలాంగుల సమస్యలపై సకలాంగుల ప్రజాప్రతినిధులు చట్టసభల్లో చర్చించకుండా వికలాంగుల సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకోవటంతో తమ సంక్షేమం అడుగడుగునా కుంటిబడి పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ 6000కు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటివరకు వికలాంగుల పెన్షన్ పెంపు గురించి ఆలోచన చేయకపోవడం ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి నేటి వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నేటి వరకు బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దురదృష్టకరమని తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన ఆయన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళితే నసుల్లాబాద్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి బాట పట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించిన ఆయన తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమంపై దృష్టి సారించి వికలాంగుల పెన్షన్ తక్షణమే 6000 చేయడంతో పాటు వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆర్టీసీలో వికలాంగులకు 100% విచిత్ర ప్రయాణ సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వెంటనే పరిశీలించి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని తెలిపారు సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జాదవ్ పండరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ మోహన్ సంఘం నసురుల్లాబాద్ నూతన మండల అధ్యక్షులు ఓండ్ల భాస్కర్ మండల ఉపాధ్యక్షురాలు రాథోడ్ కవిత బీర్కూర్ మండల అధ్యక్షులు ముఖీం ఆలసింగ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app