
పార్కుల్లో ని పరికరాలకు మరమ్మత్తులు చేయించండి.
కమిషనర్ ఎన్.మౌర్య
నగరంలోని పార్కుల్లోని మరమ్మత్తులకు గురైన పరికరాలను సరి చేయాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని ఏర్పాటు చేస్తున్న మల్టి స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణ పనులను, జగజ్జీవన్ రామ్ పార్కు ను అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. జగజ్జీవన్ రామ్ పార్కు లో వాకర్ తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు.
పాడైన ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మత్తులు చేయాలని అన్నారు. మరుగుదొడ్లు, వాకింగ్ ట్రాక్ శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో తిరుపతిని ఉత్తమ ర్యాంకు సాధించేందుకు సహకరించాలని అన్నారు. మల్టి లెవెల్ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ ను నిర్మాణ పనులు ఆలస్యం కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య కూడలి వద్ద మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, తుడా ఈఈ రవీంద్ర, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, డి.ఈ.లు రాజు, మధు, మహేష్, రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, ఏఈకాం ప్రతినిధి బాలాజి, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app