ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కి మాతృవియోగం

Spread the love

Renowned music director Keeravani is bereaved

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కి మాతృవియోగం

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు కిమ్స్‌ ఆస్పత్రిలో చెర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.

మరికాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి నివాసానికి తరలించనున్నారు. ఆమె మృతితో కీరవాణి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి మృతితో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు కీరవాణి. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, నటీనటులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.


Spread the love

Related Posts

You cannot copy content of this page

virupaksha -వీరుపాక్ష SAKSHITHA NEWS LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్