
మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రేనాటి వీరుడా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం
చిలకలూరిపేట : మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి మున్సిపల్ డి ఈ ఈ అబ్దుల్ రహీం , రవి రెవిన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం ఉద్దేశించి డి ఈ ఈ అబ్దుల్ రహీం మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న. ఆయన చరిత్ర చిరస్మరణీయం. వడ్డే ఓబన్న విలువలు, సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజం నిర్మాణం కోసం మన వంతు కృషి చేయాలని పేర్కొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
