మాస్టర్ ప్లాన్ రోడ్లపై అడ్డున్న స్థంబాలను జరిపించండి – కమిషనర్ అనుపమ

Spread the love

Remove the bollards on master plan roads – Commissioner Anupama

మాస్టర్ ప్లాన్ రోడ్లపై అడ్డున్న స్థంబాలను జరిపించండి – కమిషనర్ అనుపమ


*సాక్షిత తిరుపతి: మాస్టర్ ప్లాన్ రోడ్లపై పనులకు అవరోధంగా వున్న విధ్యుత్, టెలిపోన్ స్థంబాలను రోడ్డు ప్రక్కకు జరిపించేలా చూడాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ఆదేశాలు జారీచేసారు. తిరుపతి నగరంలో పనులు జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్లు అన్నింటి వద్ద అడ్డుగా వస్తున్న స్థంబాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి జరిపించాలని మునిసిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ కి పోన్లో తగు సూచనలు జారీచేసారు

. అంకురా హాస్పిటల్ మాస్టర్ ప్లాన్ రోడ్ పనులను మంగళవారం సాయంత్రం కమిషనర్ అనుపమ అంజలి పరిశీలించి పనుల వేగవంతానికి తగు సూచనలు చేసారు.

మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి అయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతుందని, రోడ్లు వేసేందుకు తమ స్థలాలు కోల్పోతున్న వారికి టిడిఆర్ బాండ్లను వెంటనే ఇచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page