SAKSHITHA NEWS

టీవీ9 యాజమాన్యంపై రవిప్రకాష్ లోగో పోరాటం

టీవీ9 లోగో తనదేనని దాన్ని ఉపయోగించుకుంటున్నందుకు ఆదాయంలో నాలుగు శాతం తనకు చెల్లించాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. టీవీ9 మాతృ సంస్థ అయిన ఏబీసీఎల్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని, లోగో వాడుకున్నందుకు చెల్లించాల్సిన డబ్బులను చెల్లించడం లేదని రవిప్రకాష్ కోర్టును ఆశ్రయించారు. అలాగే లోగోపై యాజమాన్య హక్కులు తనపై బదలాయించాలని రవిప్రకాష్ పిటిషన్‌ లో కోరారు.

విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ రెండు అంశాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. రూ. 168కోట్ల చెల్లింపుపై ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లో లోగో యాజమాన్య హక్కులను రవిప్రకాష్ కు బదిలీ చేయడంపై స్పందించాలని ఆదేశించింది. టీవీ9 లోగో రవిప్రకాష్ పేరు మీదనే రిజిస్టర్ అయింది. కాపీరైట్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందనే రిజిస్టర్ చేశారు. తన లోగోను నిరంతరం వాడుకుంటున్నందున తనకు పరిహారం చెల్లించాల్సిందేనని రవిప్రకాష్ వాదిస్తున్నారు.

టీవీ9కి కర్త, కర్మ, క్రియ రవిప్రకాష్. చాలా చిన్న స్థాయి నుంచి ఆ సంస్థను అభివృద్ధి చేశారు. అయితే ఆ సంస్థ అనూహ్యంగా చేతులు మారిన తర్వాత ఆయనను బలవంతంగా బయటకు పంపేశారు. ఆ చానల్ ను ఓ పొలిటికల్ టూల్ గా ఉపయోగించుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో రవిప్రకాష్ పై కేసులు పెట్టి జైలుకు కూడా పంపారు. అయినా ఆయన ఏ మాత్రం తగ్గకుండా పోరాటం చేస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app