SAKSHITHA NEWS

అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ..

సాక్షిత : ఏం అధికారులు సమన్వయంతో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలి.. 29 వ డివిజన్ వార్డ్ సభలో .ఎల్.ఏ. నాయిని రాజేందర్ రెడ్డి..

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి నాలుగు పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు డివిజన్ లో ప్రజలకు తెలియచేసి మీ అభిప్రాయాలను సేకరించడానికి ఈ వార్డ్ సభను ఏర్పాటు చేయడం జరిగిందని వరంగల్ 29 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన వార్డ్ సభలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ….

ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డ్ లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణి చేయడం జరుగుతుంది.

ఎవరైనా కొత్తగా దరఖాస్త్గులు ఇవ్వదలుచుకుంటే వీటిని స్వీకరించి పరిశీలిస్తామ.

కొత్తగా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు.

ఇల్లు కట్టుకునేనేదుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా స్థలం ఫ్లేని వారిది రెండవ జాబిత తయారు చేయడం జరిగిండి.

ప్రజాపాలనాలో దరఖాస్తు చేయని వారు చేసిన కూడా ఈ జాబితాలో పేరు లేని వారు మున్సిపాల కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.

అర్హులైనందరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని అన్నారు.

వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ…..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్ లపై నిర్వహిస్తున్న వార్డ్ సభలను సదివినియోగం చేసుకోవాలని అన్నారు.

ఆరు గ్యారంటీలను పక్కగా అమలు చేసి తీరుతాం

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒకరికి సంక్షేమ పథకాలు

అర్హులైనందరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బుద్ధా జగన్, డివిజన్ అద్యక్షుడు ఓరుగంటి పూర్ణ, ఏం.డి. బుర్ఖాన్, సౌరం బాలకృష్ణ, వంగ రామ, కే. పద్మ. బూర సురేష్, అర్ఫాన్, కే. అరుణ కే. నగేష్