పోలీస్ సిబ్బందికి రెయిన్ కోట్స్, చలికి తట్టుకునే జర్కిన్స్, అందజేసిన జిల్లా ఎస్పి

Spread the love
Rain coats, cold resistant jerkins to police personnel, given by District SP Mahbub Nagar

పోలీస్ సిబ్బందికి రెయిన్ కోట్స్, చలికి తట్టుకునే జర్కిన్స్, దోమతెరలను అందజేసిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పి

సాక్షిత : మహబూబ్ నగర్:మహబూబ్ నగర్ పోలీస్ వృత్తి అత్యంత కఠినతరమైనదని, చలి, ఎండ, వానలను లెక్క చేయకుండా, అననుకూల వాతావరణ పరిస్థితులలో దివారాత్రాలు విధులు నిర్వహించవలసి ఉంటుందని జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు.

పోలీస్ సిబ్బంది సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర డి.జి.పి. ఎం.మహేందర్ రెడ్డి తీసుకుంటున్న అనేక చర్యలలో భాగంగా జిల్లా సిబ్బంది కొరకు వచ్చిన రెయిన్ కోట్స్, చలికి తట్టుకునే జర్కిన్స్, దోమతెరలను ఎస్.పి. సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

జిల్లా పోలీస్ సిబ్బందికి ఇటీవల నిర్వహించిన ఆధునాతన వైద్య పరీక్షలను గుర్తు చేస్తూ, ప్రతిఒక్కరు వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.

పోలీస్ శాఖ గుర్తులతో కూడిన జెర్కిన్, రెయిన్ కోటు, ఇతర వస్తువులను జాగ్రత్త చేసుకోవడం, పోలీస్ సిబ్బంది మాత్రమే వినియోగించుకోవడం గుర్తుంచుకోవలసిన అంశమని ఎస్.పి. తెలిపారు.

అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగిన వివిధ బందోబస్త్ లలో చక్కగా పని చేసి, ఆయా కార్యక్రమాలను, కురుమూర్తి జాతరను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందిని ఎస్.పి. పేరుపేరునా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి. ఎ.రాములు , డి.ఎస్.పి.లు శ్రీనివాస్ , మహేష్ , ఆదినారాయణ , రమణా రెడ్డి , మధు , ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page