యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ 101 కొబ్బరికాయలతో పూజలు

Spread the love

Puja with 101 coconuts wishing Yuvagalam padayatra success

యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ 101 కొబ్బరికాయలతో పూజలు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కమ్మసిగడం ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ మహాలక్ష్మి తల్లి అమ్మవారికి తెలుగుదేశం యువనాయకులు 101 కొబ్బరికాయ లతో పూజలు చెయ్యడం జరిగింది.పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు,ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి కళా వెంకటరావు ఆదేశాల మేరకు టీడీపీ యువనాయకుడు మజ్జి రామ్మూర్తి ఆధ్వర్యంలో రేపటనుండి నారా లోకేష్ చేయబోయే యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని టీడీపీ అభిమానులతో కలిసి శ్రీ మహాలక్ష్మి తల్లి ఆలయం లో ప్రత్యేక పూజలు చెయ్యడం జరిగింది.

రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రీ నారా లోకేష్ చెయ్యబోతున్న యువగళం పాదయాత్ర పెద్ద ఎత్తున విజయవంతం కావాలని కోరుకుంటూ 101 కొబ్బరికాయలతో మొక్కలు చెల్లించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకులు దుర్గాసి వినోద్ కుమార్, వాళ్లే రమణ, గొర్లే పోలినాయుడు, రణస్థలం బాబురావు,రావాడ చందు, టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page